calender_icon.png 26 November, 2024 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయూష్.. మరో నిర్వాకం!

24-09-2024 02:46:20 AM

  1. ఆయూష్ ఫార్మసిస్ట్ పోస్టులను.. అల్లోపతి ఫార్మసిస్ట్‌లతో భర్తీకి స్కెచ్
  2. సర్వీస్ రూల్స్ సవరణలతో పాటు.. జీవో 147 రద్దు  చేయాలని నిర్ణయం
  3. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసిన అధికారులు
  4. అయోమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఆయూష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం అధికారులు మరో నిర్వాకానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అందుబాటులో లేని కోర్సును అర్హతగా పేర్కొంటూ, అభ్యర్థులు లేకున్నా ఆయూష్ ఫార్మసిస్ట్ పోస్టులకు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ క్యాలెండర్‌లో ప్రకటి ంచారు. తాజాగా ఆయూష్ ఫార్మసిస్టు పో స్టులను అల్లోపతి ఫార్మసిస్టులతో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఆయూష్ అధి కారుల తీరుపై ‘ఇచ్చంత్రం..! ఆ కోర్సు లేదు.. అభ్యర్థులూ లేరు’ అనే శీర్షికన ‘విజయక్రాం తి’ దినపత్రికలో ఈ నెల 14న కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంతో అంతర్మథనంలో పడ్డ ఆ శాఖ అధికారులు జరిగిన పొరపాటును సవరించుకోకపోగా, మరో తప్పు చేసేందుకు రెడీ అయ్యారు. ఇం దులో భాగంగా ‘ఆయూష్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు’ అర్హతకు సంబంధించిన జీ వో 147ను రద్దు చేయడంతో పాటు ఆయూ ష్ ఫార్మసిస్టు పోస్టు సర్వీసు రూల్స్‌ను సవరించి అల్లోపతి ఫార్మసిస్టులతో ఆ పోస్టు లను భర్తీ చేయాలని నిర్ణయించారు.

33 యేండ్ల తర్వాత..

ఆయూష్‌లో 1991లో ప్రభుత్వం ఫార్మాసిస్టు పోస్టులను భర్తీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. కాగా గతేడాది బీఆర్‌ఎస్ హయాంలో జాబ్ నోటిఫికేషన్ కు ఫైనాన్స్ క్లియరెన్స్ లభించింది. 33 యేండ్ల తర్వాత ఆయుష్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఆయూష్‌లోని నిరుద్యోగులు సంబురపడ్డా రు. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ రాలేదు. తాజాగా ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. తమ గోడు పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇస్తే కోర్టును ఆశ్రయిస్తామని  ఆ సంస్థలోని కాం ట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జారీ చేయనున్న నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయూష్‌లో 17 యేండ్లుగా కాంట్రాక్ట్  ఫార్మసిస్టులుగా పనిచేస్తున్న ఉ ద్యోగులు కోరుతున్నారు.

తమను ఆయూష్‌లో రెండేండ్ల డిప్లొమా కోర్సును పూర్తిచేసి న అభ్యర్థులకు శిక్షణఇచ్చి ఔట్‌సోర్సింగ్  ఉ ద్యోగులుగా తీసుకున్నారని, ఇప్పుడు అల్లోపతి ఫార్మిస్టులతో ఆయూష్ ఫార్మసిస్టు పో స్టులను భర్తీ చేస్తే తమను తొలగించే అవకా శం ఉందంటున్నారు. ఆయూష్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ ఫార్మాసిస్టులుగా ఉన్న వారికే ఐదేళ్లలో రెం డు సంవత్సరాల కాలపరిమితి గల ఆయూ ష్ డిప్లొమా కోర్సును పూర్తి చేస్తారని నిబంధనతో నోటిఫికేషన్ జారీ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నా రు.

2017లో ఐసీడీఎస్‌లో కూడా కాంట్రాక్ట్ అంగన్వాడీ సూపర్‌వైజర్ల పోస్టులకు ఇదే రకమైన  సమస్య వచ్చినపుడు ఈ నిబంధనతో నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ సర్వీసుకు వెళ్లే లా గత ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. కానీ ఆయూష్‌లో 308 ఫార్మాసిస్టుల పోస్టులను భర్తీ చేయడానికి అర్హత ఉన్న వారెవరూ లేరని తెలిసినా కొందరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆశావహులు ఆరోపిస్తున్నారు. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

25న నోటిఫికేషన్..? 

కోర్సు, అభ్యర్థులు లేరని తెలిసి కూడా ఆగస్టు 2వ తేదీన ప్రకటించిన జాబ్ క్యాలె ండర్ ప్రకారం నెల 25న ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీసుకొచ్చిన నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. 2017లో జారీ చేసిన జీవో 147 ప్రకారం ఆయూష్ ఫార్మాసిస్ట్ డిప్ల్లొమా కోర్సు చదివిన వారికే ఆయూష్‌లోని పోస్టులు కేటాయించాలని నిబంధనలున్నాయి. దీంతో జీవో147ను రద్దు చేసి తప్పు నుంచి బయట పడేందుకు ఆయూష్ అధికారులు ఏకంగా సిద్ధమయ్యారు. ఇందు లో భాగంగా సర్వీస్ రూల్స్ సవరించి మ రో కొత్త జీవోను తీసుకొస్తున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 25న జారీ చేయనున్న నోటిఫికేషన్ విషయం లో సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి సూ చనలను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నట్లు సాక్షాత్తు ఆ శాఖ అధికారులు బాహాటంగానే పేర్కొంటున్నారు.