ఇండిపెండెన్స్‌డే సందర్భంగా గీతా ఆర్ట్స్ సపోర్ట్‌తో వచ్చిన ఆయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. ఈ చిత్రం మంచి అన్నివర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే థియేట్రికల్ ఆదాయంలో 25 శాతాన్ని జనసేన పార్టీ ద్వారా ఏపీ వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత బన్నీ వాస్ ప్రకటించారు. ఈ విషయాన్ని బన్నీవాస్ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా నేపథ్యంలో సాగే గ్రామీణ ఎంటర్‌టైనర్ కు ‘ఆయ్’కు అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభిమానులంతా ఐక్యంగా ఉండి సాయం చేయాలి” అని ట్వీట్ చేశారు.