ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రేమలు, స్నేహాలు మొత్తంగా అక్కడి వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మా చిత్రంలో చూడండి అంటున్నారు నిర్మాత బన్నీవాస్. విద్యా కొప్పినీడితో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి..’ అనే ఉపశీర్షికతో రానున్న ఈ సినిమాకి అల్లు అర వింద్ సమర్పకులు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్వాతంత్య్ర దినమైన ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్టు తెలిపిన నిర్మాతలు, సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటా యన్నారు. రామ్ మిరియాల సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్:- కిరణ్ కుమార్ మన్నె.