న్యూఢిల్లీ, నవంబర్ 21: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మూడునెలల ముందే తమ పార్టీ తరఫున పోటీచేసే 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. అయి తే ఈ జాబితాలో ఆరుగురు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఉన్నారు.
వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు ఉండటం గమనార్హం. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు జుబేర్ అమ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్కు ఆప్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. అయితే తొలిజాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీటు నిరాకరించడం గమనార్హం.