03-04-2025 12:40:27 AM
మౌలిక వసతుల కల్పనకు రూ.641 కోట్లు ఖర్చు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠ శాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ (ఏఏపీసీ)ల ద్వారా అత్యవసర, నిర్వహణ పనులు పూర్తవుతు న్నాయి. తెలంగాణలోని 26,087 ప్రభుత్వ బడుల్లో పనుల బాధ్యతలు ఈ కమిటీలే చూస్తున్నాయి. అయితే మొత్తం పాఠశాలల్లో 18,366 బడు ల్లో పనులు చేపట్టగా, ఇందుకు ఇప్పటివరకు రూ.641.10 కోట్లు ఖర్చు చేసినట్టు ఇటీవల అసెంబ్లీకి విద్యాశాఖ ఇచ్చిన గణాంకాల్లో తెలిసింది.
మొత్తం ప్రారంభించిన పాఠశాలల పనుల సంఖ్య 18,335గా ఉంది. ఇం దులో 16,072 (88శాతం) పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. అమ్మ ఆదర్శపాఠశాల కమిటీల ద్వారా బడుల్లో మంచినీటి సౌకర్యం, విద్యు త్ సదుపాయం, మైనర్ రిపేర్లు, పాడైన మూత్రశాలల పునర్నిర్మా ణం, నిర్వహణ, బాలికల మూత్రశాలల నిర్మాణంతోపాటు ఇతరత్రా పనులను చేపడుతారు.