calender_icon.png 11 January, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థికి ఆపార్ ఐడి అందించాలి...

10-01-2025 10:43:19 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థికి ఆపార్ (APAAR) ఐడి తప్పనిసరిగా జెనరేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి జే. నారాయణ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బోథ్ మండలంలోని కౌఠ (బి) లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టగా, నిలిచిపోయిన పాఠశాల భవనం పనులు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఆన్లైన్ నమోదు, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు తదితరాలు పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ సిబ్బందితో మాట్లాడి కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రి, వంట పాత్రలు, వంట గది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అబ్దుల్ రావుఫ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.