22-04-2025 12:04:36 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. నల్గొండ టౌన్ లో మే 3 న జరిగే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి ము ఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సో మవారం మీడియా సమావేశంలో ఆప్ నేతలు బుర్ర రాములు గౌడ్, ఎండి. మజీద్, డా.అన్సారీ, జావీద్ షరీఫ్, అడ్డంకి రవీంద ర్, దర్శనం రమేష్, అబ్దుల్ ముఖ్తఅధిర్, అ ఫ్సర్ సలాం, మోమిన్, శివాజీ, కుత్బొద్దీన్, రాజమల్లయ్య, అజీమ్ బేగ్, షాబాజ్, నాగార్జున, జి.అంజన్న, ధర్మేంద్ర తివారి, కొడంగల్ శ్రీనివాస్ లాతోకలసి డాక్టర్ దిడ్డి సుధా కర్ ఆప్ రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను విడుద ల చేసారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రం లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని, ఈ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలోలోని అన్ని జిల్లాలో ఆప్‌ను బలోపితం చేసేందుకు, పార్టీ పునర్నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే సంపూర్ణ రాజకీయ వాతా వరణం సృష్టించేందుకు ఈ సదస్సులో చేర్చిస్తామని తెలిపారు.
లౌకిక, ప్రజాస్వామ్య శక్తిగా ఆప్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతుందని అందులో భాగమే ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఆప్ తెలంగాణ రాష్ట్ర బాద్యులు, మాజీ ఎమ్యెల్యే దిలీప్ పాండే హాజరవుతున్నారని, ప్రతి ఆమ్ క్రియాశీల కార్యకర్త ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలనీ డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు.