calender_icon.png 13 January, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులకు ఆప్ ‘సంజీవని’

19-12-2024 01:47:55 AM

*60ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం

* ప్రకటించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్

* మళ్లీ అధికారంలోకి వచ్చాక అమలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మూడోసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు తగినట్టు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమం లోనే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీని ఇచ్చారు. సీనియ ర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందించడానికి ఉద్దేశించిన ‘సంజీవని’ పథకాన్ని బుధవారం కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచి త వైద్యం లభిస్తుందని చెప్పారు.

అంతేకాకుండా మరో రెండు మూడు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రి య ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వృద్ధులు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని తెలిపిన కేజ్రీ వాల్ ప్రతి ఇంటికీ వలంటీర్లు వచ్చి పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు హెల్త్ కార్డులను అందజేస్తారని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు అందిస్తున్న రూ.1000 ఆర్థిక సాయాన్ని ఎన్నికల తర్వాత రూ. 2,100 పెంచనున్నట్టు కొద్ది రోజుల క్రితం ఆప్ ప్రకటించింది. వచ్చే  ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆప్ తన అభ్యర్థులను ప్రకటించింది.