న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆమ్ ఆద్మీని వీడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ ఇంచార్జి జైజయంత్ పాండా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్‌ను వీడిన ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఢిల్లీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి.