calender_icon.png 12 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదంగా ఆప్ ఎమ్మెల్యే మృతి

12-01-2025 12:27:57 AM

చంఢీగఢ్, జనవరి 11: పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అధికారులు వెల్లడించిన ప్రకారం.. ఎమ్మెల్యే గోగీకి శుక్రవారం అర్ధరాత్రి బులెట్ గాయాలయ్యాయి. హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు. గోగీ తలలో రెండు బులెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ప్రమాదవశాత్తూ తుపా కీ పేలినట్లు గోగీ కుటుంబసభ్యులు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ కుల్దీప్ సింగ్ చాహల్ పేర్కొన్నారు.