ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధోగతి పాలైందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆప్ అగ్ర నాయకురాలు అతిశీ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించడంపై సోమవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.40 లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ఆప్ ప్రజలనే డబ్బులు అడిగే దీనస్థాయికి వచ్చిందని పేర్కొన్నారు.