నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి రాకేష్ మీనాను ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ కలిసి సన్మానం చేశారు. ఆయనకు పూల మొక్క అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాదిక్ సోఫీ, ఇమ్రాన్, రవి, తదితరులు పాల్గొన్నారు.