calender_icon.png 20 March, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సర్వే

19-03-2025 11:15:48 PM

ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రెడ్డి సుధాకర్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తమ క్షేత్రస్థాయి కార్యకర్తలు, యువ నాయకులతో కలిసి నగర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సర్వే కార్యక్రమం మొదలు పెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు  బుధవారం రాంనగర్ డివిజన్ నాయకులు దొరపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్, యువ నాయకులు విజయ్ మల్లంగితో కలిసి ముషీరాబాద్ లోని జమీనిస్తాన్పూర్ ప్రభుత్వ ప్రాథమిక  ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సంభాషించారు.

ఇక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాలా చురుకైన సమాధానాలు ఇవ్వడమే కాకుండా ఆంగ్లంలో కూడా చాలా సునాయాసంగా సంభాషించగలిగారు. ఈ పాఠశాలలో 100% ఉత్తీర్ణత ఉందన్న విషయం తెలుసుకొని, ఇలాంటి ఫలితం ఉపాధ్యాయుల నిబద్దతతో కూడిన బోధన, హెడ్మాస్టర్ యొక్క అంకితభావం వల్లే సాధ్యమైందన్న విషయం తెలియజేస్తూ వారిని అభినందించారు. పాఠశాలలో టాయిలెట్లు ప్రణాళి ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని వాటి పరిశుభ్రతపై దృష్టి సాధించాలని వాటి మరమ్మత్తుల కోసం అధికారులకు అర్జీ పెట్టాలి అని సూచించారు. అనంతరం స్కూల్ కి సంబంధించిన సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకోగా, రామ్ నగర్ గుండు రోడ్ కి ఆనుకొని ప్రవహిస్తున్న మూసీ నది మురికి  నీటి కాలువ వల్ల వెలువడుతున్న దుర్వాసన భరించలేని స్థాయికి చేరిందని దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు.

అయితే ఈ విషయంపై విజయ్ మల్లంగి మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి సిబ్బంది క్రమబద్ధంగా పూడిక తీయకపోవడం వల్ల మురికి నీరు నిలువ ఉండి దుర్వాసన వ్యాపిస్తుంది అని పేర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్, జోనల్ కమిషనర్  జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వేసవి సెలవల లోపు ఇక్కడ పూడిక తొలగించి తాత్కాలికమైన ఊరటను లభించే విధంగా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు. పార్టీ పాఠశాల సరిహద్దుల్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క గజమైన ఖాళీ స్థలం లేకపోవడం లేదా చుట్టుపక్కల పరిసరాలలో మైదానం అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరం.

రాంనగర్ పరిసరాలలో వాడుకలో లేని పాతబడిన పారిశ్రామిక యూనిట్లు చానానే ఉన్నాయి ఇది మనందరికీ తెలిసినదే కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని భూసేకరణ చేసైనా ఈ ప్రాంతంలో కొత్త ప్రాథమిక ఉన్నత పాఠశాలలను నిర్మించి ఇక్కడి ప్రజలకు నాణ్యమైన విద్య అందించే విధంగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ లొ 7.5% విద్యకు కేటాయించిందని అది జీతా భత్యాలకే సరిపోతుందని విద్యపై 20% బడ్జెట్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ డిమాండ్ చేశారు. 

తమ చుట్టుపక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలి అంటే అక్కడ నివసించే స్థానిక ప్రజలు వారి సమీపంలో ఉన్న పాఠశాలలను సందర్శించి అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ తమ వంతు కృషి చేయాలి అని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ఈ నగరవ్యాప్త పాఠశాలల పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే తమని ఇమెయిల్ (AamAadmiPartyTelangana2014@gmail.com) లేదా ఫోన్ (9492278787) ద్వారా సంప్రదించగలరు అని తెలిపారు.