calender_icon.png 19 October, 2024 | 3:54 PM

ఆజ్ కీ రాత్..

25-07-2024 12:05:00 AM

బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాల జాబితాలో ‘స్త్రీ’ మూవీ కూడా స్థానం దక్కించుకుంది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా సిద్ధమైంది. ‘స్త్రీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా భాటియా కూడా నటించింది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తమన్నా భాటియా పాత్ర గురించిన సమాచారాన్ని మేకర్స్ ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదు. కానీ, మూవీలో మిల్కీబ్యూటీ ఆడిపాడిన ఓ పాటను బుధవారం విడుదల చేశారు.

‘ఆజ్ కీ రాత్’ అనే పేరుతో వచ్చిన ఈ సాంగ్‌లో తమన్నా ఆకుపచ్చ దుస్తుల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ నెట్టింటిని హీటెక్కిస్తోంది. ‘తోడీ పుర్సత్ బీ మేరీ జాన్ కబీ బాహూన్ కో దీజీయే.. ఆజ్ కీ రాత్  మజా హుస్న్ కా ఆంకోంసే లీజియే...’ అంటూ సాగుతున్న ఈ పాట సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య అందించారు. సచిన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మధుబంటి బాగ్చి, దివ్యకుమార్‌లతో గొంతు కలిపారు. ఈ గీతానికి విజయ్ గంగూలీ కొరియోగ్రాఫర్‌గా, జిష్ణు భట్టాచార్‌జీ డీవోపీగా వ్యవహరించారు.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దినేశ్ విజన్ నిర్మాత. పాటలో గ్రీన్ కలర్ డ్రెస్‌లో అందచందాలు ఆరబోసిన తమన్నా.. మూవీ ప్రమోషన్స్‌లో ఇటీవల ఎరుపు రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది. తనదైన అందమైన చూపులతో రెడ్ రోజ్‌లా ఆకర్షిస్తున్న తమన్నా ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఖరీది నహీ జా సక్తీ, హసీనో కీ ఇజాజత్.. ఆజ్ కీ రాత్...’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో ‘వేదా’, తెలుగులో సంపత్ నంది క్రియేట్ చేసిన ‘ఓదెల’ ప్రాంఛైజీలో అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్న ‘ఓదెల నటిస్తోంది.