calender_icon.png 21 October, 2024 | 2:58 PM

సీనియర్ నటీమణుల ఆజ్ కా తస్వీర్

30-07-2024 12:05:00 AM

అప్పట్లో నటిగా తన అందచందాలతో ప్రేక్షకుల మదిని దోచుకుంది సీనియర్ నటీమణి మధుబాల. ఎందరో స్టార్ హీరోల సర సన అద్భుతమైన హావభావాలు పలికించటం ద్వారా సన్నివేశాలను చక్కగా పండించి ంది మరో సీనియర్ కథానాయిక సంగీత. ఈ ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వారు పోషిస్తున్న పాత్రల లుక్స్ సోమవారం విడుద లయ్యాయి. ‘పరదా’ చిత్రంలో సంగీత గృహిణి పాత్రలో రత్నమ్మగా వంటింట్లో గరిటె తిప్పు తూ కనిపించగా, ‘కన్నప్ప’ సినిమా కోసం చెంచుల వీరత్వాన్ని తెలిపేలా రణభూమిలో కత్తి తిప్పుతూ వీరనారిగా దర్శనమిచ్చింది మధుబాల.

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో డాక్టర్ మోహన్‌బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖ తారాగణంతో కలిసి మధు బాల కూడా భాగమవుతున్న విషయం తెలి సిందే. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సిని మాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ‘పరదా’లో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్‌వంటి యువ కథానాయికలతో జత కలిసిందీ సీనియర్ హీరోయిన్ సంగీత.