calender_icon.png 6 March, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

03-03-2025 12:00:00 AM

చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి

చెన్నూర్, మార్చి 2 (విజయక్రాంతి) : పత్తి పంట మార్కెట్ కమిటీలలో అమ్మిన రైతులకు డబ్బులు వారి వారి ఖాతాలలో జమ చేసేందుకు సదరు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి షాబుద్దీన్ ఆదివారం తెలిపారు. కాటన్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కేవలం విక్రయ రసీదు జారీ చేస్తుందని, పత్తికి సంబంధించి ఆదిలాబాద్ శాఖ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేయబడతాయన్నారు.

ఇందులో ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలకు వారి ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం సక్రమంగా లేని రైతులకు సంబంధించిన సొమ్ము తిరిగి సి.సి.ఐ. ఖాతా కు వెళుతుందని, రైతులు ఆధార్ సెంటర్ ను సందర్శించి ఆధార్ ప్రామాణికతను ధృవీకరించుకోవాలన్నారు. తమ బ్యాంకు అధికా రులను సంప్రదించి క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే రైతులకు రావలసిన చెల్లింపులు సకాలంలో అందుతాయని తెలిపారు.