01-03-2025 12:02:02 AM
ఇక విచారణే అవసరం లేదన్న ధర్మాసనం
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా ఉన్న సర్కార్ దవాఖానల్లో వైద్యం పొందేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని శుక్రవారం హైకోర్టుకు కౌంటర్ సమర్పించింది. ఆధార్ కార్డుతో నిమిత్తం లేకుండానే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించింది. ఆధార్ కార్డు లేని కారణంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు కొందరికి చికిత్స నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
పిటి షన్‌పై తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..
ఆధార్ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని, పిటిషనర్ పేర్కొన్న మహిళతోపాటు మరో 100 మందికి వైద్యులు ఆధార్ లేకుండానే చికిత్స అందించారని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు ఆధార్ అవసరంలేదన్నారు. ఈ వాదనలను నమోదు చేసిన ధర్మాసనం పిటిషన్‌పై ఎలాంటి విచారణ అవసరంలేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.