పిట్లం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్ ప్రయాణ సౌలభ్యాన్ని పొందుతున్న మహిళలు తమ ఆధార్ కార్డులను నవీకరిం చూకోవాలని బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. ఆధార్ కార్డు అసలు ప్రతులను మాత్రమే బస్సులలో ఎక్కేందుకు తీసుకురావాలని బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి విజ్ఞప్తి చేశారు.
ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పాత ఫోటోలు, నకిలీ ఆధార్ కార్డుల వల్ల కండక్టర్లు-ప్రయాణికుల మధ్య వాదనలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది మహిళలు పిల్లలప్పుడు లేదా పెళ్లికి ముందు తీసిన ఫోటోలతో కూడిన ఆధార్ కార్డులను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని ఈ ఫోటోలు వారి ప్రస్తుత రూపానికి సరిపోకపోవడంతో, కండక్టర్లు గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ఫోటోలు నవీకరించకపోతే గుర్తింపు ధృవీకరణలో సమస్యలు వస్తాయని, ఇది అనవ సరమైన వాదనలకు దారితీస్తుందని ఆమె వివరించారు.
ఇటీవల కొన్ని సందర్భాల్లో, ప్రయా ణికులు తమ పాత ఫోటోలను చూపించి బస్సు ప్రయాణాన్ని ఆలస్యపరిచారని నివేదికలు వచ్చాయని,అధికారులు కలర్ ఫోటోకాపీలను ఆధార్ కార్డుగా ఉపయోగించడాన్ని కూడా ఖండించారు. ఇంకా, ఇతర రాష్ట్రాల ప్రయాణికులు నకిలీ ఆధార్ కార్డులతో తెలంగాణ ఉచిత సేవను దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది.
ఇలాంటి నకిలీ ఆధార్లు ఈ యోజన లక్ష్యాన్ని హాని చేస్తాయి అని డిపో మేనేజర్ హెచ్చరించారు. ఈ నియమాలు పాటిస్తే, కండక్టర్ల పని సులభమవు తుంది. ప్రయాణ సౌలభ్యం కూడా కల్పించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తి టీజిఆర్టిసి సిబ్బందికి నియమాలను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుందని ఆమె విశ్వా సాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సహకారంతోనే సామాజిక సేవలు సఫలమవుతాయని, నిజమైన వారికి మాత్రమే ఉచిత ప్రయాణ సౌలభ్యం లభించేలా సహాయపడండి అని డిపో మేనేజర్ కోరారు.