మలక్‌పేట, అక్టోబర్ 22: ట్రాన్స్‌జెండర్లు ఆధార్ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యక క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. మలక్‌పేటలోని దివ్యాంగుల భవనంలో ఈ క్యాంప్ మూడు రోజుల పాటు కొనసాగనున్నది. ట్రాన్స్‌జెండర్లుగా మారిన వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. కానీ, వారు ఆధార్ కార్డు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌ను ప్రోగ్రాం మేనేజర్ జయంతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రీతి ప్రారంభించారు.