20-02-2025 12:59:41 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఫిబ్రవరి 19 : (విజయ క్రాంతి): ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుండి వీ.సీ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులు 61412 మంది, పదిహేను సంవత్సరాల వయస్సు గల వారు 40275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ పెండింగ్ లో ఉందని డీ.డీ చైతన్యరెడ్డి తెలిపారు.
ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ అప్ డేట్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈ.డీఎం కార్తీక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్, డీడబ్ల్యుఓ రసూల్ బీ, డీఎస్సీడీఓ నిర్మల, పోస్టల్ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.