calender_icon.png 17 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్త కుప్పలో ఆధార్/ పాన్‌కార్డ్‌లు

17-03-2025 12:07:03 AM

తపాలా కార్యాలయం అధికారి  నిర్లక్ష్యం      

అడవి ప్రాంతం చెత్త కుప్పలో దర్శనం

చర్ల, మార్చి 16  (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల చర్ల మండలంలో ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇతర లేఖలు శనివారం అడవిలో ప్రత్యక్షమయ్యాయి. మీ సేవ కార్యాలయాలలో ఆధార్ కార్డ్ ,ఏటీఎం కార్డ్ ,పాన్ కార్డ్ అప్లై చేసుకున్న దరఖాస్తుదారులారా మీ కార్డు కోసం ఎదురు చూస్తు న్నారా అయితే ఇదిగో తిమ్మిరీ గూడెం గ్రామం అటవీ ప్రాంతం లో పడేసిన ఈ మూటలో ఉన్నాయేమో చూసుకోండి అంటూ తెలిపే పరిస్థితి నెలకొంది. ఇంటింటికి తిరిగి దరఖాస్తు దారులకు ఇవ్వాల్సిన లేఖలు పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలకు చేరకుండా అటే ప్రాంతం లో  పడి ఉన్నాయి. . మీ ఆధార్ కార్డుకి మీరే బాధ్యులు అంటూ పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు  కనిపిస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం బిఎస్ (పోస్టల్ డిపార్ట్మెంట్) పరిధిలో గల కలివేరు గ్రామానికి సంబంధించిన తపాలా కార్యాలయం లో  కొన్ని పత్రలు తిమ్మిరి గూడెం అటవీ ప్రాంతంలో  ఆధార్ కారడ్స్, పాన్ కారడ్స్ ఏటీఎం కారడ్స్ ,తదితర పోస్టల్ సంబంధించిన కారడ్స్ అన్ని డెలివరీ చేయకుండా నిర్మానుస్య ప్రాంతంలో పడేసి ఉండడంతో ప్రజల బిత్తర పోతున్నారు. ప్రజలకు చేరాల్సిన ఆధార్ కారడ్స్ పాన్ కారడ్స్  అడవి ప్రాంతంలో దర్శనం ఇవ్వడంతో  ఎంతగానో మండి పడుతున్నారు. దరఖాస్తు దారులు వారి పత్రాలు ఇంకా తమ చేతికి అందలేదని ఇప్పటికి కొందరు మీ సేవలు చుట్టూ తపాలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

వివరాల్లోకెళ్తే ....

సత్యనారాయణపురం కి చెందిన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న చంద్ర మేఘన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తుంది అయితే సదరు సదరు పోస్టు ఉమాన్ గత కొద్ది రోజులుగా కార్యాలయానికి వస్తున్న తపాలాలను ఇంటి దగ్గరే పెట్టి మర్చిపోవడం అవి పనికిరానివిగా భావించి కొన్ని పత్రాలను తగలబెట్టడం మరికొన్ని పత్రాలను పడవేయటం చేశారు. కుటుంబ సభ్యులు దీంతో శనివారం వాటి తాలూకు ఆచూకీ తిమ్మిరి గూడెం వద్ద కనిపించడంతో  ఈ వ్యవహారం అంతా బయటకొచ్చింది , సదరు పోస్ట్ ఉమెన్ కొంతకాలం  క్రితమే అశ్వాపురం మండలం బ్రాంచ్ ఆఫీసర్ గా  మొండికుంట  గ్రామం ఎస్ ఓ గా బదిలీపై వెళ్లారు.

దీంతో మూడు నెలలుగా  ప్రజలకు అందాల్సిన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ పత్రాలు, తదితర పత్రాలు ప్రజలకు అందకపోవడంతో  మీ సేవలు సెంటర్ల వద్ద సమాచారం కోసం తిరుగుతున్నారు,  ఆధార్ అప్డేట్ కోసం , పాన్ కార్డ్ అచ్చుతప్పులు  ఇంటి చిరునామా మార్చుకునేం దుకు మీ సేవలో వద్ద పడికాపులు కాస్తూ దరఖాస్తు చేసుకునేందుకు పడుతున్న అవస్థలు అంత ఇంతా కాదు అలాంటిది చేతికందాల్సిన ఆధార్ కార్డులు డెలివరీ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ... ఇలా నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజల కోరుతున్నారు.