20-03-2025 09:03:43 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన నిరుపేద అల్లంకొండ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబానికి పట్టణంలోని ఆదరించు సేవాసమితి సభ్యులు అండగా నిలిచి నిత్యవసర సరుకులు అందజేశారు. గురువారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి నిత్యావసర సరుకులు అందచేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుటుంబ పెద్దదిక్కు కుమార్ మరణంతో వారి కుటుంబం పరిస్థితులు దయానీయంగా మారాయి. మృతునికి భార్య కళ ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉండగా కనుమ పెద్దది కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
స్థానిక సహకారంతో సమాచారం అందుకున్న ఆదరించు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కంపాటి మురళి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు మానవత్వంతో ఆలోచించి పేదరికంతో బాధపడుతున్న వారికి తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహయం చేయాలని కోరారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో ఎంతోమంది నిరుపేదలకు, విద్యార్థులకు అనారోగ్యంతో బాధపడే వారికి, వేసవిలో చలివేంద్రం ఏర్పాటుతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సంస్థకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వరద రాబర్ట్, శ్రీపతి రమేష్, జోసెఫ్,లు పాల్గొన్నారు.