calender_icon.png 23 October, 2024 | 2:22 AM

రెండు రోజులు వర్షాలు

09-08-2024 12:44:07 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాదాపు 21 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.