calender_icon.png 13 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు వర్షాలు

05-08-2024 01:31:32 AM

వాతావరణ కేంద్రం

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొం ది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హనుమకొండ, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా ల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.