హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం, తూర్పు జార్ఖండ్‌లో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీనంనగర్ జిల్లాలో అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.