మాజీ మంత్రి మోత్కుపల్లి
యాదాద్రి భువనగిరి, జూలై 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ఆయన జన్మదిన సందర్భంగా యాదగిరి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు. నిన్నమొన్న ఏపీ సీఎంగా అధికారం చేపట్టిన చంద్రబాబు వెంటవెంటనే హామీలు అమలు చేస్తున్నారని, అదే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తే బాగుంటుందన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వమే తల్లీ తండ్రి అని, వారిపై చేయి చేసుకోవడం మంచిది కాదన్నారు. వారి తల్లిదండ్రుల శాపాలు ప్రభుత్వాన్ని దెబ్బతిస్తాయన్నారు. నిరుద్యోగులకు సర్కార్ వెంటనే నెలకు రూ.5 వేల భృతి ప్రకటించాలన్నారు. రాజకీయాల్లో నీతికి స్థానం లేద న్నారు. తన వద్ద రూ.10 కోట్లు ఉంటే టికెట్ వచ్చేదన్నారు. తన మాదిగ కులానికి రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.