calender_icon.png 26 October, 2024 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రొటోకాల్ రగడ

16-07-2024 12:33:24 AM

  1. హైదరాబాద్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో చెక్కుల పంపిణీలో.. 
  2. వేదిక కింద కూర్చొని ఎమ్మెల్యే సబిత నిరసన

ప్రొటోకాల్ ఉల్లంఘనలతో మా హక్కులు కాలరాస్తున్నారు

ఓడిపోయిన వ్యక్తితో చెక్కుల పంపిణీనా?

  • మూడుసార్లు మంత్రిని.. ఐదుసార్లు ఎమ్మెల్యేని

అధికారులు ప్రొటోకాల్ పాటించట్లేదు: సబిత

వేదిక కింద కూర్చొని ఎమ్మెల్యే నిరసన

మహేశ్వరం, జూలై 15: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ప్రభు త్వ చెక్కులు పంపిణీ చేయడంపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు. మూడుసా ర్లు మంత్రిగా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధికి ప్రజాపాలనలో దక్కే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అంటూ మం డిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆర్‌కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయం వద్ద బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆల  యాల అభివృద్ధి కోసం సోమవారం చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రభుత్వ ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్‌రావు, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి కూర్చున్నారు. ఆ సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెక్కుల పంపిణీ చేసే వేదిక వద్దకు ఇతరులు రావొద్దని పేర్కొనడం.. అధికారులు వత్తాసు పలకడంతో వివాదం మొదలైంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు.

ఓడిపోయిన వ్యక్తి వేదికపై కూర్చుంటే.. మూడుసార్లు మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఎక్కడ కూర్చోవా లో చెప్పండని మండిపడ్డారు. ప్రజాస్యామ్యంలో గెలిచిన నాయకులకు గౌరవం లేకుండా రాజకీయ ఎజెండతో రేవంత్‌పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లైంగిక దోపిడీలు జరుగుతుంటే ప్రభు త్వం కళ్లు మూసుకొందని, నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనిపించడం లేదా? అని విరుచుకుపడ్డారు. అధికారులు, పోలీసులు సబితనుని సముదాయించేందుకు ప్రయత్నించారు. తన ప్రశ్నకి సరైన సమాధానమిచ్చే వరకు వేదికపైకి రాను అని తేల్చిచెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రొటో కాల్‌పై ప్రశ్నిస్తానని స్పష్టంచేశారు.