సీఎంను కోరిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. శుక్రవారం ఉద్యోగోన్నతులు పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో ఎల్బీస్టేడియంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. శుక్రవారం జరిగే సమావేశంలో వేదికపై నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలపై మాట్లాడతారన్నారు. సీఎంను కలిసిన వారిలో నాయకులు బీరెల్లి కమలాకర్‌రావు, కె.జంగయ్య, అంజిరెడ్డి, కృష్ణుడు, రాధాకృష్ణ ఉన్నారు.