calender_icon.png 18 January, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత

08-08-2024 03:19:10 AM

సంగారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 3 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఆందోల్ మండలంలోని డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వీణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా 3 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడిని వట్‌పల్లి మండలంలోని గౌతాపూర్ గ్రామానికి చెందిన దాడ్లె మోయిద్దీన్‌గా గుర్తించారు. గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. 

మల్కాజిగిరి పరిధిలో..

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించి 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్కేపురానికి చెందిన సిరిల్ జోసెఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి ఒక ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శేరిలింగంపల్లి ఆదర్శ నగర్ ప్రాంతంలోని ప్యారడైజ్ రెస్టారెంట్ వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నరేందర్ కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా శంషాబాద్ డీటీఎఫ్ టీం దాడులు నిర్వహించి 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు.