పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కులగణన చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ.. కులగణనకు కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సమయం లో తెలంగాణలో ప్రకటించారని గుర్తుచేశారు. అందుకు తెలంగాణ నుంచే కులగణన ప్రారంభం కావాలన్నారు. కులగణనతో బీసీ జనాభా తేలి, తద్వారా రిజర్వేషన్లు పెం చడానికి అవకాశం ఉంటుందని కృష్ణయ్య తెలిపారు. ఎంపీలు మస్తాన్‌రావుయాదవ్, మల్లు రవి, బాబురావు, నాగరాజు, అప్పలనాయుడు, బీసీ నేతలు ఆర్ లక్ష్మణ్‌యాదవ్, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు.