హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. బుధ, గురువారా ల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని తెలిపింది. మంగళవారం మహబూబాబాద్, ఖమ్మం, హనుమ కొండ, సూర్యాపేట, వరంగల్, కొత్తగూడెం, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ, కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు వివరించింది.