calender_icon.png 23 October, 2024 | 12:58 PM

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

29-07-2024 12:46:56 AM

యాదాద్రి భువనగిరి, జూలై 28 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 2 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. స్వామివారి నిత్య హోమ, కల్యాణోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం లక్ష్మీనరసింహుల వెండిజోడి సేవ సంప్రదాయరీతిలో నిర్వహించారు. స్వామివారికి ఆది వారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.23,53,996 ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు. యాదాద్రి ఆలయ సన్నిధిలో ఆషాఢ మాసంలో సాధారణంగా భక్తుల తాకిడి తగ్గుముఖం పడుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

స్వామివారి సేవలో ప్రముఖులు..

నరసింహుడిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి పూజలు నిర్వహించారు.