calender_icon.png 15 January, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా’ 3,658 కోట్ల పెట్టుబడులు

18-07-2024 01:11:47 AM

ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్యారిస్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్ ఉత్పత్తి సంస్థ ‘సనోఫి’.. తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో వచ్చే ఆరేళ్లలో రూ.3,658 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం ఆయన రాయదుర్గంలో సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్’(జీసీసీ)ను ప్రారంభించారు.  ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఫార్మా కంపెనీగా సనోఫికి పేరుంది. 

వచ్చే ఏడాది కాలంలో రూ. 914 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు జరుగుతాయని మంత్రి తెలిపారు. దీనివల్ల వచ్చే రెండేళ్లలో 2,600 కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. -హైదరాబాదులో సనోఫీ సంస్థ ఏఐ ఆధారితమైన మొదటి బయోఫార్మా కంపెనీగా అవతరించాలని కోరుకోవడం ఆనందంగా ఉందన్నారు. సాంకేతిక, ఫార్మా ప్రతిభను కలిగి ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అన్నారు. సనోఫి విస్తరణ రాష్ర్ట ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుందని మంత్రి వెల్లడించారు. బహుళ జాతి ఔషధ కంపెనీల ఏర్పాటుకు, సామర్థ్య వృద్ధికి తమ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందన్నారు.