బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి
సంగారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షు రాలు గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ సమీపంలో రైతు సత్యాగ్రహం దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు పెట్టు బడి సాయంగా ఎకరానికి రూ.15 వేలు అందజేయాలని, కౌలు రైతులకు, వ్యవసా య కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి పంటల బీమా యోజనను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్‌రెడ్డి, నాయకులు ప్రతాపరెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, శివకుమార్, చల్లా ప్రభాకర్‌రెడ్డి, మందుల నాగరాజ్, వాసురాజుగౌడ్, విజయకుమార్, జగన్నాథ్, భాస్కర్ తో పాటు రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.