శిక్షణ కానిస్టేబుళ్లకు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ సూచన
సంగారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): శిక్ష ణ కానిస్టేబుళ్లు న్యాయ చట్టాలపై అవగాహ న పెంచుకోవాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపేష్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. శిక్షణ కానిస్టేబుళ్లకు పలు సూచన లు చేశారు. అనంతరం వారితో కలిసి భోజ నం చేశారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ సంజీవరావ్, వైస్ ప్రిన్సిపాల్, డీఎస్పీ రమేశ్, చీఫ్ డ్రిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా..
గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీ చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేసినా, అక్రమ రవాణా చేసినా 87126 56777 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.