calender_icon.png 23 December, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచారానికి పాల్పడిన యువకున్ని కఠినంగా శిక్షించాలి

23-12-2024 05:09:23 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన మతిస్థిమితం లేని మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించి, అత్యాచారానికి పాల్పడిన యువకుడు చెట్ల పోశెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆనంతరం దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిందితుడికి కఠినమైన శిక్ష విధించి మైనర్ బాలికను న్యాయం చేయాలని కోరుతూ ఇచ్చోడ సీఐ భీమేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మల్యాల కరుణాకర్, కాంబ్లే కుషాల్, గాయ్ కాంబ్లే బాలాజీ, రమేష్, లహుదాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.