calender_icon.png 8 January, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తికి దేహశుద్ధి చేసిన యువతి

06-01-2025 12:00:00 AM

నల్లొండ, జనవరి 5 (విజయక్రాంతి): తనతో అసభ్యంగా ప్రవర్తి  ఓ వ్యక్తికి యువతి దేహశుద్ధి చేసింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన ఝూన్సీరాణి అనే యువతి పట్టణంలోని ఎస్బీఐ ఎదుట ఇడ్లీ బండి నిర్వహిస్తున్నది.

పట్టణానికే చెందిన అబ్దుల్ రహీం ఇడ్లీ బండి వద్దకు వచ్చి పదిరోజులుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తి  బాధితురాలు రహీం కుటుంబానికి చెప్పినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ ఫోన్ నంబర్ అడగడంతో ఆగ్రహానికి గురైన యువతి అతడిని నడిరోడ్డుపై చితకబాదింది.

ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు యువతి ధైర్యానికి ఫిదా అవుతూ శభాష్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.