calender_icon.png 20 April, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు చికిత్స పొందుతు మృతి

12-04-2025 07:58:41 PM

కొల్చారం (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలో నీ రంగంపేట గ్రామానికి చెందిన హాసన్న గారి రంజిత్ కుమార్ (20) బైక్ మెకానిక్ తేదీ 06.04.2025 నాడు మధ్య రాత్రి రెండు గంటల సమయంలో తన యొక్క మోటార్ సైకిల్ నెంబర్ TS 07 EY 7220 పల్సర్ బండి పై కోనాపూర్ నుండి రంగంపేటకు వస్తుండగా మార్గమధ్యంలో బోయిన సిద్దయ్య వ్యవసాయ భూమి పక్కన గల రోడ్డు మూల మలుపు వద్దకు రాగానే మోటార్ సైకిల్ నడుపుతున్న రంజిత్ కుమార్ తన మోటార్ సైకిల్ ని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కనే గల కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది.

దీంతో రంజిత్ కుమార్ వ్యవసాయ భూమి నందు పడిపోగా రంజిత్ కుమార్ కు తలపై ముఖంపై ఎడమ కన్ను బొమ్మపై బలమైన గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తము 108 అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స గురించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోగా తదుపరి అక్కడి నుండి సంగారెడ్డి లోని బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొని పోయి అడ్మిషన్ చేసినారు తదుపరి సంగారెడ్డి నుంచి తేదీ 10.04.2025 నాడు రాత్రి 12:50 గంటల సమయంలో గాంధీ ఆసుపత్రి నందు అడ్మిషన్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తేదీ 11.04.2025 నాడు సాయంత్రం సమయంలో మరణించినాడు. మృతుడి తండ్రి హోసన్న గారి యాదయ్య  ఫిర్యాదు మేరకు  ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.