ప్రియదర్శి ప్రధాన పాత్రలో వాల్ పోస్టర్ సినిమాస్ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రియదర్శిపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు.
‘అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్తమన్; స్క్రీన్‌ప్లే: రామ్ జగదీశ్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి. కథ, దర్శకత్వం: రామ్ జగదీశ్.