calender_icon.png 15 March, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

15-03-2025 07:40:39 PM

మునిపల్లి: మంజీరా బ్యాక్ వాటర్ లో  చేపలు పట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన ఇది. శనివారం మునిపల్లి మండలంలోని తగడపల్లి గ్రామ శివారులో మంజీరా బ్యాక్ వాటర్ లో పడి యువకుడు మృతి చెందాడు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చిన్నచిల్మెడ గ్రామానికి చెందిన దూదేకుల అమీరుద్దీన్ (30), మండలం తకడపల్లి గ్రామానికి చెందిన సద్దాం అహ్మద్ లు కలిసి తగడపల్లి గ్రామ శివారో గల సింగూర్ బ్యాక్ వాటర్ లో కరెంటు వైర్లతో  చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ తగిలి అమిరుద్దీన్ మృతి చెందాడు. మృతుని సోదరుడు దూదేకుల బషిరోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.