01-03-2025 10:18:37 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన విద్యుత్ షాక్ కి గురై నిమ్మల ప్రసాద్(32) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన వివరాలు బంధువులు తెలిపిన ప్రకారం... పరిమి వెంకన్న పొలంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భాను శ్రీ, 3 సంవత్సరాల బాబు ఉన్నారు. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.