calender_icon.png 24 April, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

23-04-2025 11:30:36 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సంజీవయ్య కాలనీకి చెందిన తాడూరి నరేష్ (38) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగజ్నగర్ కు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా బెల్లంపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మంచిర్యాల వైపుకు కాలినడకన వస్తుండగా సబ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తండ్రి గతంలోని చనిపోయాడు. తల్లి విజయలలితో మంచిర్యాలలో ఉంటున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ వెల్లడించారు.