calender_icon.png 12 February, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

12-02-2025 07:29:16 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రామాంజారం గ్రామానికి చెందిన నడి కొప్పుల సంపత్ అనే యువకుడు సురక్ష బస్టాండ్ సమీపంలోకి బైక్ పై వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంపత్ ను మెరుగైన వైద్య చికిత్సలు నిమిత్తం మణుగూరు 100 పడగల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సంపత్ బుధవారం మృతి చెందాడు. సంపత్ మృతితో రామాంజారంలో విషాదాచాయలు అలుముకున్నాయి.