calender_icon.png 26 December, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

08-11-2024 04:15:23 PM

మంథని (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామపంచాయతీలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన చుంచు రమేష్ అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చుంచు రమేష్ తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గుంపుల మానేరు వంతెన దాటుతుండగా వావిలాల ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న వ్యానును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.