calender_icon.png 10 January, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి..

09-01-2025 10:14:03 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఇంద్రవెళ్లి మండలంలోని దుబ్బగూడలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం... గుడిహత్నూర్ మండలం దావెగూడ గ్రామానికి చెందిన మడావి భీంరావ్ (26) డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు వ్యవసాయ పనులకు తోడుగా ఉంటున్నాడు. దుబ్బగూడలో ఉంటున్న అక్క సీతాబాయి గ్రామానికి వెళ్తానని ఇంట్లో చెప్పి రెండు రోజుల క్రితం వచ్చాడని తెలిపారు. గురువారం తన అక్క ఇంట్లో ఉన్న ఉయ్యాల తాడును తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ గురికావడంతో తీవ్ర గాయలు అయ్యాయి. వెంటనే 108 అంబులెన్సు సమాచారం అందించి కొనఉపిరితో ఉన్న మడావి భీంరావ్ ను అదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.