calender_icon.png 14 January, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

13-01-2025 10:53:47 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన ఈసం రోహిత్ (19) సోమవారం ద్విచక్రం వాహనం అదుపు తప్పి కిందపడి మృతి చెందాడు. బోడు పోలీసుల కథనం ప్రకారం.... మొట్లగూడెం గ్రామానికి చెందిన ఈసం రాంబాబు కుమారుడు ఈసం రోహిత్ (19) మొట్లగూడెం నుంచి టేకులపల్లికి  వెళుతుండగా మార్గమధ్యలో కారేపల్లి తండా దాటాక తాను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోడు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.