calender_icon.png 25 February, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు బైకులు ఢీ.. యువకుని మృతి

25-02-2025 04:32:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. కన్నెపల్లి ఎస్సై గంగారం కథనం మేరకు... వీగాం గ్రామానికి చెందిన దుర్గం రాజేష్ (29) తన సోదరుడు అభిలాష్ తో కలిసి బైక్ పై మల్లిడి వెళ్తుండగా, బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ తన తండ్రి అంజయ్యతో కలిసి దహేగాం వైపు వెళ్తున్న క్రమంలో పోలంపల్లి స్టేజి వద్ద శ్రావణ్ కుమార్ అతివేగంగా వచ్చి రాజేష్ బైక్ ను ఢీకొనడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

అభిలాష్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రావణ్ కుమార్, అతని తండ్రి అంజయ్యలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనకు వెళ్లి వివరాలు సేకరించారు. గాయపడ్డ అభిలాష్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గం రాజేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు.