నాగర్‌కర్నూల్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి బస్సు కింద పడి ఓ యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నెచర్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెన్నెచర్ల గ్రామానికి చెందిన సంపంగి శైలేష్(19), మరో ఇద్దరు యువకులను వెంటబెట్టుకుని పొలంలో మందు పిచికారీ చేసేందుకు బైకుపై పొలానికి వెళుతున్నాడు.
ఈక్రమంలో ముందు వెలు తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఇందు లో ఇద్దరు యువకులు పక్కకు దూకి తప్పించుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద పడగా తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించడగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. .
ట్రాక్టర్ బైక్ ఢీకొని..
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడపగల్ కుచెందిన యువకుడు సాయి (28) గురువారం రాత్రి తన తల్లితో కలిసి సంగారెడ్డి జిల్లా శంకరంపేట్ వచ్చాడు. తిరిగి గ్రామానికి వస్తుండగా శంకరంపేట్ శివారులో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
డివైడర్‌ను ఢీకొని మరొక
భైంసా: భైంసా రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవరు దుర్మరణం చెందారు. భైంసా పట్టణానికి చెందిన సాయినాథ్(36) డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయం త్రం సరకు వాహనంతో బాసర వెళుతుండగా దేగాం సమీపంలో వాహ నం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన సాయి అక్క డికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. భైంసా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.