calender_icon.png 30 October, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు తాగి యువకుడి మృతి

30-10-2024 01:17:10 AM

  1. కల్లు దుకాణంపై గ్రామస్థుల దాడి 
  2. ప్రాణం ఖరీదు వెలకట్టిన వ్యాపారులు 

అచ్చంపేట, అక్టోబర్ ౨౯: కల్తీ కల్లు తాగి యువకుడు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ఆగ్రహంతో గ్రామస్తు లు కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశా రు. బాధితుల వివరాల ప్రకారం.. బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిల్ (23) హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

దసరా సెలవుల్లో ఇంటికి వచ్చి కల్లు కు బానిసయ్యాడు. కల్తీ కల్లు కోసం తాపత్రయ పడుతూ నిత్యం తాగి రోడ్లపై తిరిగేవాడు. సోమవారం సాయంత్రం కల్లు దుకాణం ముందు అపస్మాకర స్థితిలో గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో బంధువులు, గ్రామస్థులు కల్తీ కల్లు తయారీ చేసే దుకాణం ముం దు మృతదేహాన్ని ఉంచి నిరసన చేపట్టారు.

అగ్రహంతో కల్లు దుకాణాన్ని దాడి చేశారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ రవీందర్ అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎలాం టి అనుమతులు లేకుండా ఇష్టారీతి గా అల్ఫాజోలం వంటి మత్తు పదార్తాలను వాడుతూ కల్తీ కల్లు తయారీ దుకాణాలు వెలుస్తున్నా అదికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు.

అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా, మృతుడి కుటుంబానికి కల్లు వ్యాపారులు రూ.౩.౫ లక్షలు చెల్లిస్తామని బెదిరింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఇది లాఉండగా కడుపునొప్పి భరించలేక యువకుడు మృతిచెందినట్టు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిందని సీఐ రవీందర్ తెలిపారు.