మంథని (విజయక్రాంతి): మంథని పట్టణం గంగపురిలో శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడిని మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కిందపడి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలంకు చేరుకొని ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.